ఒకే ట్రాక్​పై మెట్రో, నమో భారత్​ రైలు.. అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ ఎక్కడంటే?

-

ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్​​లోని అత్యాధునికి ఫీచర్లతో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. ఈ ఆర్ఆర్​టీఎస్ భూగర్భ రైల్వే స్టేషన్​లో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్, మెట్రో ఒకే ట్రాక్​పై పరుగులు పెట్టనున్నాయి. ఇలా మెట్రో రైలు, హైస్పీడ్ రైలు ఒకే ట్రాక్​పై పరుగుపెట్టడం దేశంలోనే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.

ఈ రైల్వే స్టేషన్​లో నాలుగు ప్రవేశ, నిష్క్రమణ గేట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు సులువుగా బయటకు వెళ్లేందుకు, లోపలి వచ్చేందుకు అత్యాధునిక ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. బేగంపుల్ స్టేషన్ పొడవు 246 మీటర్లు కాగా, వెడల్పు 24.5 మీటర్లు. రైల్వే స్టేషన్ లోతు సుమారు 22 మీటర్లు. భూగర్భంలో రైల్వే స్టేషన్ ఉండడం వల్ల ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల వైద్య సాయం కోసం ఎన్సీఆర్ టీసీ ప్రతిస్టేషన్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్ట్రెచర్లను తీసుకెళ్లేందుకు అనువుగా లిఫ్ట్​లను రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news