ప్రైవేట్ పార్ట్‌ని బ్లేడ్‌తో కోసిన ప్రేయసి.. కేకలు వేస్తూ పరిగెత్తిన 60 ఏళ్ల ప్రియుడు

ప్రకాశం జిల్లా కొండపి మండలం మూగచింతల. ఇదే గ్రామంలో సిహెచ్ హరినారాయణ(60) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య లేకపోవడంతో ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ(55) తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లపాటు వీరి అక్రమ సంబంధం ఘనంగా వర్ధిల్లింది. ఏ విషయంలో గొడవలు జరిగాయో తెలియదు.

కానీ ఇటీవల వీరిద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు దరిచేరాయి. వీరిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయింది. ఇక ఇటీవల ప్రియుడు హరిహరనారాయణ ప్రియురాలి వద్దకు వెళ్లాడు.

ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య మరోసారి గొడవ రాజుకుంది. కోపంతో ఊగిపోయిన ప్రియురాలు ఇంట్లో ఉన్న బ్లేడు తీసుకొని ప్రియుడి మర్మంగాన్ని కోసేసింది. దీంతో లబోదిబోమంటూ హరిహర నారాయణ బయటకు పరుగులు తీశాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన బాధితుడు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.