ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 4వ తేదీన బాధ్యతలు స్వీకరించిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలలో లోపాలను సరిచేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా పౌరసరపరాల శాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. గతంలో రేషన్ కార్డుదారులకు రేషన్ తో పాటు సరఫరా చేసిన సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.
రెండు నెలలుగా ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ నుండి బియ్యంతో పాటు పంచదార కూడా ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో పంపిణీ చేసిన పంచదార ప్యాకెట్ల తుకాల్లో తేడాలు ఉన్నట్లు తేలడంతో జూలై, ఆగస్టు నెలల్లో కార్డుదారులకు పంచదార సరఫరాని నిలిపివేశారు.
ఇప్పుడు ఆ లోపాలను సరిచేసి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదారని కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక అక్టోబర్ నెల నుండి కందిపప్పు, గోధుమపిండి కూడా పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్నవారికి అరకేజీ పంచదార రూ. 13 రూపాయలకే అందించనున్నారు.