కౌలు రైతులకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త..

కౌలు రైతులకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా తు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

Cm Jagan
Cm Jagan

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కౌలు రైతులకు అండగా సీసీఆర్సీపైన అందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు. కౌలు రైతులకు దీనివల్ల మేలు జరుగుతుందన్న సీఎం జగన్‌.. సీసీఆర్సీ పెంచడంవల్ల కౌలు రైతులకు అన్నిరకాలుగా ప్రభుత్వ సహాయం అందుతుందని పేర్కొన్నారు.

వీలైతే ప్రతి ఇంటికీ వెళ్లి సీసీఆర్సీపై అవగాహన కల్పించాలన్న సీఎం సీసీఆర్సీ వల్ల రైతు హక్కుకు ఎలాంటి భంగం కలగదని, దీనిపై పూర్తిస్థాయి సమాచారాన్ని వారికి వివరించాలని స్పష్టం చేశారు. అన్ని వివరాలతో ముఖ్యమంత్రిగా నా తరఫు నుంచి ఒక లేఖ పంపించండని ఆదేశించారు. మే 16న రైతు భరోసా, జూన్‌ 15లోగా పంట బీమా పరిహారం చెల్లింపులు జరుగాలని ఆదేశించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.