నానికి ఏమైందో మరి..మురిసిపోతున్న నేచురల్ స్టార్!

-

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఈ పిక్చర్ పై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ నటి నజ్రియ ఫాహద్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సాంగ్స్ ను ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్ ‘ఎంత చిత్రం’ ప్రోమో విడుదల చేశారు. సదరు ప్రోమోలో నాని తనకు ఏమైందో..అన్నట్లు గా తనలో తాను మురిసిపోతున్నాడు. ప్రేమలో పడ్డట్లు నాని, నజ్రియా ఇచ్చే క్యూ్ట్ ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ఈ నెల 9న సాయంత్రం 6.03 గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు నేచురల్ స్టార్.

 

Read more RELATED
Recommended to you

Latest news