ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు నూతన ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతల చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేయడం గమనార్హం. ఇక అంతకు ముందు చంద్రబాబు కాన్వాయ్ లో బయలుదేరారు. భారీ హోర్డింగ్ లు, గజమాలలతో ఆయనకు దారి పొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. సీఎం మార్గ మధ్యలో తన కాన్వాయ్ ని ఆపి వారితో మాట్లాడారు.
అనంతరం సచివాలయానికి చేరుకొని అక్కడ పూజలు నిర్వహించిన తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం చేశారు. పింఛన్లు రూ.4వేలు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం చేశారు. పింఛన్ల పెంపు పై సంతకం చేసే సమయంలో వికలాంగులు, వృద్ధులు కొందరూ అక్కడికి చేరుకొని చంద్రబాబుకు నమస్కారాలు చేశారు. అలాగే అన్న క్యాంటిన్ పున:ప్రారంభం పైల్ పై నాలుగో సంతకం, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు చంద్రబాబు.