గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ శుభవార్త చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని… జూన్ 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని పేర్కొన్నారు సీఎం జగన్. మిగిలిపోయిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పారని..వారికి అవసరమైన శిక్షణ, సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు చెప్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని.. ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసును పెంచామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని వెల్లడించారు.జూన్ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలని..అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలని.. ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదన్నారు.