గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ పై కీలక నిర్ణయం

-

సీఎం జగన్ మరో తీపి కబురు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజాగా సీఎం జగన్ శుభ వార్త చెప్పారు. ఇప్పటికే 1.34 లక్షల మంది గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం… 2021 జనవరి మాసంలో రెండో విడత భర్తీ చేసిన దాదాపు 19,000 మంది ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసేందుకు రెడీ అయింది.

అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 2023 సంవత్సరం జనవరి మాసం నాటికి వారికి రెండేళ్ల సర్వీస్ పూర్తి కానుంది. కాగా ప్రొబేశన్ ఖరారు అయితే శాశ్వత ఉద్యోగులు లాగే పే స్కేల్ వేతనాలు వారికి వస్తాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news