తూర్పుగోదావరి జిల్లా : దమ్ముంటే చంద్రబాబును అరెస్టు చేయండని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి వైసీపీ పార్టీకి సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాశవిక పాలన టిడిపి అధినేత చంద్ర బాబు, మాజీ మం త్రి నారాయణల పై కేసులు నమోదుపై మండిపడ్డారు.

తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు నిలబడవని.. దమ్ముంటే చంద్రబాబును అరెస్టు చేయండి. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. నవరత్నాలు బోగస్ అని.. గడప గడపకు వైసిపికి వెళ్ళడానికి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని మండిపడ్డారు.
వైసిపి నేతలను ప్రజలు నిలదీస్తున్నారని.. వైసిపి ప్రభుత్వానికి చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టిడిపి పొత్తులంటే వైసిపి నేతలకు భయమని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ అభివృద్ధికి పూర్తి గా కుంటుపడిందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.