మాకు పంపే చీరలు..నాదెండ్లకు పంపండి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ గర్జన కార్యక్రమం ఫెయిల్ చేయాలి అనే పవన్ కళ్యాణ్ 15 న జనవాణి కార్యక్రమం ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ మాకు చీరలు ఇస్తా అంటున్నారు… వైసీ పీ నాయకులకు చీరలు ఇచ్చే బదులు, భార్యాభర్తలు గా కలిసి తిరుగుతున్న మనోహర్ కి ఆ చీర ఇవ్వాలని చురకలు అంటించారు. రేపు నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు వైసీపీ పూర్తి మద్దతు అని ప్రకటన చేశారు.
విశాఖ గర్జన ర్యాలీ లో లక్షలాది మంది పాల్గొంటారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉంది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని కావాలని డిమాండ్ చేశారు గుడివాడ అమర్నాథ్. దీనిని ఎవరూ ఆపలేరని, ఆపే దమ్ము కూడా ఎవరికీ లేదని స్పష్టం చేశారు గుడివాడ అమర్నాథ్.