గుంటూరు మంకీ ఫాక్స్ అనుమానిత బాలుడికి నెగిటివ్

-

ఇటీవల గుంటూరులో మంకీ పాక్స్ అనుమానిత కేసు కలకలం రేపింది. ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్) లో చేరాడు. రెండు వారాల క్రితమే జిజిహెచ్ కు బాలుడ్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే ఒంటిపై దద్దుర్లు ఉండడంతో మంకీ పాక్స్ గా వైద్యులు అనుమానించి శాంపిల్స్ ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి జిజిహెచ్ అధికారులు పంపించారు.

రిపోర్ట్ ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని ఓ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశా కి చెందిన వారు. వారు ఉపాధి కోసం పల్నాడు కి వచ్చారు. అయితే నేడు (సోమవారం) మంకీ ఫాక్స్ అనుమానిత బాలుడికి నెగిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జిజిహెచ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news