జగన్ ఆయన నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్లారు – బిజెపి జాతీయ కార్యదర్శి

కరోనా సమయం నుండి ఇరవై కోట్ల మంది పేదలకు కేంద్రం బియ్యం ఉచితంగా అందిస్తుందని కొనియాడారు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్. మరో మూడు నెలల పాటు బియ్యం ఇచ్చేవిధంగా ఈ పథకాన్ని పొడిగించారని అన్నారు. ఈ రాష్ట్రంలో బియ్యం పేదలకు ఇస్తున్నారా లేదా అక్రమంగా విక్రయిస్తున్నారా అన్నది అందరికి తెలుసన్నారు. ఆధికార పార్టీ నేతల ద్వారా విదేశాలకు బియ్యం ఎగుమతి చేశారని ఆరోపించారు.

సిఎం సలహాదారులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం మూడున్నర ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేలకు దర్శన భాగ్యం కల్పించారని ఏద్దేవా చేశారు. అభివృద్ధి చేస్తున్నట్లు గొప్పులు చెప్పుకున్నారని ఆరోపించారు. సిఎం జగన్ ఎన్ని సార్లు ఆయన నియోజకవర్గానికి వెళ్ళారని ప్రశ్నించారు సత్యకుమార్. గడపగడపలో ప్రజల నుండి ఎమ్మెల్యేలు ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.