బాబుకు ఓటు వేయడం అంటే.. గవర్నమెంట్ బడిని కార్పొరేట్ కి అమ్మేయడమే అన్నారు. మల్లీ వైద్యం కోసం అప్పులు కావడమే.. రైతన్నలు రైతు భరోసాను వదులుకోవడమే అని ఇంటింటికి వెళ్లి చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయడం అంటే చంద్రముఖిని మనమే వెల్లి నిద్రలేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టేనని ప్రతీ ఇంట్లో చెప్పండి. మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతున్నాం.. గతంలో చంద్రబాబు మంచి చేయలేదు.. మాయ చేసి ఓట్లు అడుగుతున్నాడు.
ఫ్యాన్ కి మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్ కి నాంది అన్నారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఇంటి బయటనే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలి అని చెప్పండి. ప్రతీ ఊరికి చేసిన మంచి గురించి చెప్పండి. 2019కి మించిన మెజార్టీ 175 కి 175 స్థానాలు 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు జగన్. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తాం. చేయగలిగిందే చెబుతాం.. అందులో చెప్పిన ప్రతీ ఒక్కటి చేస్తాం. జగన్ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లేదు అని ఈ సందర్భంగా చెబుతున్నాను. ప్రతీ ఇంటి నుంచి క్వాలిటీ చదువులు అందిస్తున్నాం. పేదవాళ్లు అనే మాటనే ఉండకూడదు. పేదలకు సమానమైన అవకాశాలు రావాలి.