జగన్ సీఎం గా గెలిస్తే.. ఆయన ఏ పదవీ ఇచ్చినా తీసుకుంటా : ముద్రగడ

-

తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. భగవంతుని దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నానని తెలిపారు వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ముద్రగడ వ్యాఖ్యలు గోదావరి జిల్లాలో రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ తన రాజకీయ నిర్ణయం ప్రకటించారు. వైసీపీలో చేరడం పై స్పష్టత ఇచ్చారు. ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని స్పష్టమవుతోంది.


ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ముద్రగడ స్వయంగా ప్రకటన చేశారు. ఈ నెల 14న తన కుమారుడు గిరి తో సహా వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. దీంతో కొంత కాలంగా ముద్రగడ వైసీపీలో చేరడం పై జరుగుతున్న చర్చ పైన స్పష్టత వచ్చింది. ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పిఠాపురం నుంచి పోటీ లో నిలుస్తారని భావించారు. అయితే, ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ముద్రగడ గతంలో కాకినాడ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news