బీఆర్ఎస్ పొత్తు పై మాయావతి సంచలన నిర్ణయం..!

-

పార్లమెంట్‌ ఎన్నికల వేల తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఊహించని విధంగా బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. అయితే..ఈ తరుణంలోనే బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తుపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అంటూ ట్వీట్‌ చేశారు.బీఆర్ఎస్, బీఎస్పీ ల మధ్య కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి కొద్ది సేపటి క్రితమే తెరదించారన్నారు.

ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమి లో లేనందున, బీఎస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయడానికి బెహన్జీ మాయావతి అనుమతించారని బీఎస్పీ హై కమాండ్ తెలిపిందన్నారు. త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీఎస్పీ యం పీ, కేంద్ర సమన్వయకర్త, రాంజీ బెహన్జీ దూతగా హాజరు కానున్నారని పోస్ట్‌ పెట్టారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news