బరువు అదుపులో ఉండాలంటే.. మెటబాలిజమ్ పెంచుకోవాల్సిందే..!

-

బరువును అదుపులో పెట్టుకోవాలంటే జీవక్రియ (మెటబాలిజమ్)ను పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో కొందరికి సహజంగానే కేలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. స్త్రీల కంటే పురుషుల్లో విశాంత్రి తీసుకుంటున్నప్పుడు కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియలో వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. వయసు పెరిగినప్పుడు జన్యు స్వభావాలు మార్చుకోవచ్చు. జీవక్రియను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Exercise
Exercise

కండరాలు వృద్ధి చేసే వ్యాయామంపై దృష్టి..
మానవ శరీరం నిరంతరం కేలరీలను వినియోగించుకుంటూనే ఉంటుంది. పనిలేని సమయంలోనూ జీవక్రియ కొనసాగుతుంది కాబట్టి కేలరీలు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఆరోగ్యంగా, కండరాలు బలంగా ఉన్న వారు విశాంత్రి తీసుకున్న సమయంలో కేలరీలు ఖర్చయ్యే ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంది. అర కిలో వరకున్న కండరాలు తన కోసమే రోజుకు సుమారు 6 కేలరీలు వినియోగించుకుంటే.. అరకిలో కొవ్వు రోజుకు 2 కేలరీలను ఖర్చు చేస్తుంది. రోజులు గడిచే కొద్ది వీటిని లెక్కేస్తే ఎక్కువే ఉంటుంది. అందుకే కండరాలు వృద్ధి చేసే వ్యాయామంపై దృష్టి సారించాలి. అప్పుడు జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది.

ఏరోబిక్ వ్యాయామంతో మేలు..
శరీరానికి ఎక్కువగా ఆక్సిజన్ అందించే నడక, ఈత, పరుగు వంటి ఎరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల జీవక్రియ వేగంగా పని చేస్తుంది. ఏరోబిక్ వ్యాయామం వేగం, ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత మేలు చేకూరుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలో కేలరీలను వినియోగించుకోవడానికి నీరు తప్పనిసరిగా వాడాలి. ఒంట్లో నీటిశాతం తగ్గినా జీవక్రియ మందగిస్తుంది. రోజుకి 4 గ్లాసులు నీరు తాగేవారితో పోలిస్తే 8 గ్లాసులు తాగేవారిలో మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి రోజూ తగినంత నీరు తాగేలా చూసుకోవాలి.

food
food

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం..
కొవ్వు, పిండి పదార్థాలతో పోలిస్తే ప్రోటీన్ ను జీర్ణం చేసుకునే సమయంలో శరీరం మరింత ఎక్కువగా కేలరీలను ఖర్చు చేసుకుంటుంది. కాబట్టి ఆహారంలో పిండిపదార్థాలను తగ్గించి చికెన్, చేపలు, పప్పు గింజలు, చిక్కుళ్లు, గుడ్లు, వెన్న తదితర పదార్థాలను రోజూ వారి ఆహారంలో చేర్చుకోండి. దీంతో ఒకవైపు శరీరానికి శక్తినిస్తూనే మరోవైపు కేలరీలు ఎక్కువగా ఖర్చయ్యేలా చేస్తాయి. అలాగే మసాలాలు, మిరపకాయలు, మిరియాలు వంటివి తరచూ ఆహారంలో తీసుకున్న జీవక్రియ మెరుగుపడుతుంది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫిన్ అత్యధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని, ఎక్కువశాతం ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడ్రియాట్రిక్స్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news