బాబు గారి ఫ్రెండ్ బాధ‌లు రాష్ట్రానికి అంట గ‌ట్టేస్తున్నారుగా…?

-

వినేవాడు ఉండాలే కానీ.. చెప్పేవాడు స‌బ్బం హ‌రి అన్న‌ట్టుగా ఏపీ రాజ‌కీయాలు ఉన్నాయ‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ హ‌యాంలో ఎంపీగా చ‌క్రం తిప్పిన ఆయ‌న త‌ర్వాత 2014లో అస్సలు పోటీనే చేయ‌న‌ని పోటీకి దూరంగా ఉన్నారు. త‌ర్వాత కాలంలో కాంగ్రెస్‌లోనే ఉంటూ.. టీడీపీకి అనుకూలంగా మారారు. ఇక‌, 2019 నాటికి త‌న పార్టీ టీడీపీనేన‌ని ప్ర‌క‌టించుకుని చంద్ర‌బాబు భ‌జ‌న చేస్తూ ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారి భీమిలి టికెట్‌పై పోటీ చేశారు. వైసీపీ జోరులో స‌బ్బం చిత్తుగా ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఆయ‌న టీడీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారేమో.. అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయ‌న పార్టీలోనే ఉన్నాన‌ని అంటూనే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు మాత్రం దూరంగా ఉంటున్నారు.


అడ‌పా ద‌డ‌పా.. టీడీపీ అనుకూల మీడియాల్లోకి వ‌చ్చి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నాలుగు తిట్లు.. ఎనిమిది విమ ‌ర్శ‌లు చేసి తెర‌మ‌రుగవుతున్నారు. అయితే, ఈయ‌న‌కు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ధ్య ఒకే ఒక్క విష‌యంలో మాత్రం సారూప్య‌త క‌నిపిస్తోంది. అదే.. త‌మ బాధ‌ను రాష్ట్రానికి అంట‌గ‌ట్టేయ‌డం!  త‌మ‌కు ఏదైనా నొప్పి క‌లిగితే.. వెంట‌నే రాస్ట్రానికి అంట‌గ‌ట్టేయ‌డం అనేది చంద్ర‌బాబుకురాజ‌కీయంగా అబ్బిన విద్య అని అంటారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు ఈ విష‌యంలో స‌బ్బం హ‌రి కూడా త‌న బాధ‌ను రాష్ట్రం మొత్తానికి అంట‌గ‌ట్టేస్తుంటారు. ఇంకే ముంది ప్ర‌జ‌లు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు అన్నారు తాజాగా!

నిజానికి ప్ర‌జ‌లు న‌ర‌కంలో ఉన్నారో.. మ‌రేమో.. వారు నిర్ణ‌యించుకోగ‌ల‌రు. కానీ, తాము ఇప్పుడు రాజ‌కీ యంగా అనుభ‌విస్తున్న‌ది న‌ర‌క‌మే! ఎదుగూ బొదుగు ఉంటుందో ఉండ‌దో అనే సందేహంతో  పార్టీని న‌డిపిస్తున్న‌ది చంద్ర‌బాబు.. ఇక‌, ఈ పార్టీలో పేరుకే ఉంటూ.. ఏదైనా మంచి పార్టీ పిలిస్తే.. బాగుండు క‌దా.. అని అనుకుంటున్న‌ది స‌బ్బం హ‌రి! దీనిని మించిన న‌ర‌కం ఇంకేముంటుంది. అయితే, వీరు ఈ విష‌యం మాత్రం చెప్ప‌కుండా.. ప్ర‌భుత్వం పై ప‌డి ఏడుస్తున్నార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.. అని స‌బ్బం హ‌రి!

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేసి ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం లేద‌ని చెప్పుకొ చ్చారు. నిజానికి గ‌డిచిన ప‌దినెల‌ల కాలంలో అనేక రూపాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్రమా లు అమ‌లు చేసింది. అయితే, గ‌తంలో మాదిరిగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు.. నాయ‌కుల‌కు , సానుభూతిప‌రుల‌కు కాకుండా పేద‌ల‌కు మాత్ర‌మే అందుతున్నాయి. దీంతో స‌బ్బం హ‌రి వంటి వారికి ఇబ్బందే. అందుకే ఆయ‌న త‌న ఇబ్బందిని ప్ర‌జ‌ల నెత్తిన రుద్దుతూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు విశ్లేష‌కులు. నిజ‌మేనంటారా.. హ‌రిగారు!!

Read more RELATED
Recommended to you

Latest news