వాసుపల్లి ఎంట్రీతో వైసీపీకి వచ్చిన బెన్‌ఫిట్ ఇదేనా..?

-

జగన్ ఏ ముహూర్తన మూడు రాజధానుల ఏర్పాటు చేయనున్నామని చెప్పారో, అప్పటి నుంచి విశాఖపట్నంలో బలంగా ఉన్న టీడీపీ వీక్ అవ్వడం స్టార్ట్ అయింది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకోవడం, చంద్రబాబు ఏమో అమరావతికి మద్ధతు తెలపడంతో, విశాఖలో పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారాయి. ఇక బాబు అమరావతికి మద్ధతుగా నిర్ణయం తీసుకోవడంతో, విశాఖ తమ్ముళ్ళు వైసీపీకి అనుకూలంగా నడవడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ బాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టారు. అటు నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీలో ఉండటం కష్టమే. అలాగే వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సైతం గంటా రూట్‌లోనే వెళ్తారు. కాబట్టి విశాఖ నగరంలో మాత్రం టీడీపీకి గట్టి షాక్‌లు రెడీగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాసుపల్లి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల, ఆ పార్టీకి మంచి బెన్‌ఫిట్ ఉందని తెలుస్తోంది.

సౌత్‌లో వైసీపీ వీక్‌గానే ఉంది. ఎన్నికల్లో ఓడిన ద్రోణంరాజు శ్రీనివాస్ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో బలమైన వాసుపల్లి వైసీపీలోకి రావడం కలిసొచ్చే అంశం. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం వల్ల వైసీపీ బాగా పుంజుకుంది. అలాగే వాసుపల్లి ఎంట్రీ ఇవ్వడంతో, సౌత్‌లో మంచి బలం వచ్చింది. ఎందుకంటే వాసుపల్లికి పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ ఉంది.

ఇదే అంశం వైసీపీకి కలిసి రావొచ్చు. అలాగే ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన విశాఖ కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈలోపు గంటా, గణబాబులు టీడీపీకి షాక్ ఇచ్చి, వైసీపీకి మద్ధతు ఇస్తే ఇంకా తిరుగుండదు. మొత్తానికైతే వాసుపల్లి వైసీపీలోకి రావడం వల్ల బాగా బెన్‌ఫిట్ అవుతుందనే చెప్పొచ్చు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news