రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు వెళ్లనున్న ఆయన ఎల్లుండి కూడా అక్కడే ఉండనున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన అని అంటున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు జగన్. ముందుగ రేపు ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి కడప కు చేరుకోనున్న జగన్, కడప నుంచి ఉదయం 11. 20 గంటలకు పులువెందుల నివాసానికి చేరుకోనునున్నారు.
![Jagan](https://cdn.manalokam.com/wp-content/uploads/2020/08/images-32.jpeg)
తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు కడప నుంచి బయల్దేరి సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక ఎల్లుండి ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల వివాదం పై జరిగే “ అపెక్స్ కౌన్సిల్” సమావేశంలో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. అయితే ఇది జరిగేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అయినా ఆయన ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.