జగన్ ఎమర్జన్సీ మీటింగ్.. దాని కోసమే !

పోలవరం పై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష అనే కంటే కూడా అత్యవసర సమావేశం అని చెప్పచ్చు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్, ఇతర అధికారులు హాజరయ్యారు. నిన్న జగన్ సర్కార్ కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం అంచనా వ్యయాన్ని 2013-14లో తెలిపినట్లుగా 20,398.61 కోట్లకే పరిమితం చేశారు.

 

దీంతో ఈ తాజా కేంద్ర ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించనున్నారు. చంద్రబాబు హయం లో కేంద్రం 55 వెలకోట్లు కు అంగీకరించి ఇప్పుడు మాట మార్చడం మీద ఈ చర్చ జరుగుతోంది. 2013లో వచ్చిన కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు భారీగా పెరగడంతో… ప్రాజెక్టు తుది అంచనా వ్యయం 55,548.87 కోట్లుగా అంచనా వేసింది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ కూడా ఇందుకు అంగీకరించింది. అయితే భూ సేకరణ వ్యయాన్ని కుదిస్తూ గత ఏడాది జూలైలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈనెల 12వ తేదీన పీపీఏకు కేంద్రం లేఖ రాసింది.