ఖైదీలకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఖైదీలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. ఖైదీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వీటిల్లో వినియోగించుకొని, వేతనాన్ని వారి కుటుంబాలకు పంపిస్తామన్నారు.
అటు ఖైదీల మానసిక ఎదుగుదలకు యోగాలో శిక్షణ ఇస్తున్నామన్నారు. అటు ఉద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ తీపి కబురు అందించారు. 2023 జూలై నుంచి అమలయ్యేలా కొత్త వేతన సవరణ కమిషన్ నియమించాలని ఉద్యోగ సంఘాలు నిన్నటి సమావేశంలో కోరగా… ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి బొత్స భరోసా ఇచ్చారు. దీనిపై సీఎం జగన్ తో చర్చించి వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు 70% బకాయిలు చెల్లించామన్న బొత్స సెప్టెంబర్ లోగా మిగతా 30% బకాయిలు చెల్లిస్తామన్నారు.