ఏపీ రైతులకి గుడ్ న్యూస్..ఖాతాల్లో వెయ్యి కోట్లు జమ !

-

వైయస్సార్‌ రైతు భరోసా కింద రెండో ఏడాది రెండో విడత చెల్లింపులు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఈ చెల్లింపులను క్యాంపు కార్యాలయంలో వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, వేణుగోపాల కృష్ణ, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ అర కోటి మందికిపైగా రైతులకు దాదాపు 6,797 కోట్ల రూపాయలను వైయస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ కింద అందిస్తున్నామని అన్నారు.

ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఏటా రూ.13500 పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇక మరో పక్క జూన్, జులై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం పరిహారమందించింది. లక్షా 66 వేల మంది రైతుల ఖాతాల్లోకి 135 కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే, అదే సీజన్‌లో పరిహారమివ్వడం.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని జగన్ అన్నారు. రైతు తన కాళ్లపై తాను నిలబడే ఉద్దేశ్యంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news