జగన్ ప్రభుత్వం ప్రజల్ని దగా చేసింది : ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య 

-

జగన్ ప్రభుత్వం ప్రజల్ని దగా చేసిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తాజాగా ఆయన రాజహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీ ద్వారా డిసెంబర్ లోపు భర్తీ చేయాలని తొలి సంతకం చేశారు చంద్రబాబు. 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం పెట్టుకుంది. పెన్షన్లు రూ.4వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. దానిని ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తున్నాం. అలాంగే వికలాంగులకు రూ.6వేలు పెన్షన్లు అందిస్తున్నాం. మాట తప్పుకుండా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.

కళాకారులందరికీ రూ.10వేలు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వం ప్రజల్ని దగ చేసింది. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. పెన్షన్లు అందజేస్తున్నారు. పేదవాడికి అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేశాం. జగన్ మోహన్ రెడ్డి అన్నా క్యాంటిన్లను రద్దు చేశాడు. వాటిని మళ్లీ పున:ప్రారంభించామని తెలిపారు. దోచుకోని తిన్న వారందరి భరతం పడుతామన్నారు. జగన్ మోహన్ రెడ్డి దగ్గరి నుంచి దోచుకున్న అధికారులందరి భరతం పడతామన్నారు. మంచి పరిపాలన ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గంజాయి లాంటి మహమ్మారిని తరిమికొడతామన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news