ఈ రోజు కరోనా నివారణ చర్యలపై జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లోమీడియాతో కూడా యుద్దం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారన్న ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరమని అన్నారు. నెగిటివ్ వార్తలు చదువుదామన్న, మనం కరెక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం, వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదామని ఆయన పేర్కొన్నారు.
ఇక ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గడం మంచి పరిణామమని జగన్ అన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందనడానికి ఇదే నిదర్శమన్న ఆయన కరోనా తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనవరిలోపు వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి ఉందని జగన్ పేర్కొన్నారు. అలానే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీతో కరోనాకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 104 ట్రోల్ ఫ్రీ నెంబర్ సరిగ్గా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన వ్యక్తికి అరగంటలోనే బెడ్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.