కేంద్ర మంత్రి అమిత్ షాకు వైఎస్ జగన్ లేఖ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. భారీ వర్షాలు , వరదలతో తీవ్రంగా నష్టపోయామని అమిత్‌ షాకు లేఖలో విన్నవించారు. వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. 2,250 కోట్ల ఆర్థిక సాయం చేసి ఆంధ్రాని ఆదుకోవాలని అమిత్‌ షా ని జగన్ కోరారు.

అలానే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తిందని లేఖలో ప్రస్తావించారు జగన్‌. ఈ ఎగువ నుండి వచ్చిన వరదలతో నష్టం మరింత పెరిగిందని పేర్కోన్నారు. వరుసగా కురిసిన వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని కూడా జగన్ లేఖలో తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తిపైనా కూడా వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని పేర్కోన్నారు. 4400 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు పేర్కొన్న జగన్ తక్షణమే వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు జగన్.