జగన్ మార్కు బాదుడంట… బాధ్యత ఉండక్కర్లే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా పరిపాలించాలో.. ఎవరికి నచ్చినట్లు పరిపాలించాలో.. పసుపు పత్రికలు చెబితే కచ్చితంగా అలానే నడుచుకోవాలని కార్యకర్తలు, నాయకులు జగన్ కు సూచిస్తారేమో ఆలోచించాలి! జగన్ చేసేవాటిలో ఏదైనా తప్పుడు నిర్ణయం ఉంటే.. దాన్నీ గట్టిగా ఖండించాల్సిన బాధ్యత మీడియాకు పుష్కలంగా ఉంది! అయితే… జగన్ ఏమి చేసినా తప్పే అంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు!

ప్రస్తుతం ఏపీలో మోటారు వాహనాల నిబంధనల చట్టం ఉల్లంఘించిన వారిపై రవాణాశాఖ తీవ్రంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే! చట్టాలు ఉన్నదే జనం పాటించడానికి, సమాజం సక్రమంగా నడవడానికి! అది సక్రమంగా అమలుచేసినా కూడా ఒక వర్గం మీడియాకు నచ్చడం లేదు! అందుకే భరత్ అను నేను సినిమాలో మహేష్ బాబు లాగా.. జగన్ ఫైన్స్ తీవ్రంగా పెంచేశారు! ఫలితంగా బాధ్యతగా నడుచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు! అయితే ఇప్పుడు ఒక వర్గం మీడియాకు ఇది “జగన్ మార్కు బాదుడు”గా కనిపిస్తుంది!

“రాష్ట్రంలో మోటారు వాహనాల నిబంధనల చట్టం ఉల్లంఘించిన వారిపై రవాణాశాఖ బాదుడు మొదలుపెట్టింది. దీంతో వాహన యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం తెలిసి వాహనాలను రొడెక్కించాలంటేనే యజమానులు హడలిపోతున్నారు.” అంటూ తాజాగా కొన్ని కథనాలు రాసుకొచ్చింది ఒక వర్గం మీడియా! సక్రమంగా రూల్స్ పాటించకుండా రోడ్లెక్కేసి జనాల ప్రాణాలతో ఆడుకోవడానికి.. వాహనాలకు జగన్ అనుమతి ఇవ్వడం లేదనే స్థాయిలో ఉన్న ఈ వాదనను ఏమనాలి? ఏమని సమర్ధించాలి? వీరి వాదనకు అర్ధం ఉందా?

ఇదే పనులు సినిమాలో హీరోలు చేస్తే చప్పట్లు కొడతారు.. సక్రమంగా ఆలోచింఛారు అని పొగుడుతారు.. ఇలాంటి సీఎం లు రియల్ లైఫ్ లో ఉండరంటూ మాట్లాడతారు.. టీవీలో డిబెట్లు పెట్టేస్తారు! మరి నిజ జీవితంలో కూడా ఒక ముఖ్యమంత్రి అలా ఆలోచిస్తే ఎందుకు సమర్ధించరు.. ఎందుకు మద్దతు పలకరు.. సరికదా విమర్శలు చేస్తున్నారు.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు ప్రజలు!!