ఏపీ కళాకారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..త్వరలోనే గుర్తింపు కార్డులు

-

ఏపీలోని కళా కారులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఏపీలోని కళాకారులను ప్రోత్సహిస్తామని.. వారందరికీ గుర్తింపు కార్డులు అందజేస్తామని ప్రకటన చేశారు మంత్రి రోజా. ఇందు కోసం మార్గదర్శకాలు కూడా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి రోజా. దేశంలో మొదటి సారిగా ఆధునిక టెక్నాలజీతో నిర్వహిస్తున్న మ్యూజియం బాపు మ్యూజియం అని… సమ్మర్ లో ప్రతి ఒక్కరూ బాపు మ్యూజియంను సందర్శించాలని నా విజ్ఞప్తి అన్నారు.

బాపు మ్యూజియం మన చరిత్రను గొప్పదనాన్ని తెలియజేస్తున్నదని.. ఏలూరు, అనంతపురం మ్యూజియాలు ఈ తరహాలోనే అభివృద్ధి పరుస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మ్యూజియాలను డెవలప్ చేస్తామని.. స్కూల్ పిల్లలకు టూర్స్ పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.

రూ.12,800కోట్లతో తమ ప్రభుత్వం దీనిని ఆధునీకరించారని.. బాబు మ్యూజియంని చూస్తే ఫారెన్ కంట్రీ లో మ్యూజియం చూసినట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే కచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలని.. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లే వాళ్లకి ఇక్కడ చరిత్ర ని చూపిస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. 360 డిగ్రీ స్క్రీన్ రెడీ అవబోతుంది. ఆదిమానవుల చరిత్రను తెలుసుకునే విధంగా దీన్ని రెడీ చేస్తున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news