దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఖర్చు చేసే నిధులు, అభివృద్ధిపై ప్రతివారం సమీక్ష చేస్తున్నాం… మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఉన్న దేవాలయాలలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు.

cm jagan
cm jagan

వంద కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపడతాం… దేవాదాయ శాఖలో ఆడిట్ జరగటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. 2022 మార్చి నాటికి ఆడిట్ నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

195 6-ఏ కేటగిరీకి చెందిన దేవాలయాల ఆడిట్ పూర్తి అవుతోంది… వీటిని త్వరలోనే అన్ లైన్ లో ఉంచుతామన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మరో 1425 6-బి కేటగిరీ దేవాలయాల్లోనూ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలిచ్చాం… అవకతవకలుంటే రికవరీ కూడా సదరు అధికారిని బాధ్యుడుగా చేస్తామని తెలిపారు. 11 వేల ఫైళ్లను గడచిన 4-5 నెలల్లో పరిష్కరించామని వెల్లడించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.