జగన్ ఉత్తరకొరియా నియంత కిమ్ ని మించిపోయాడు – నారా లోకేష్

-

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరకొరియా నియంత కిమ్ ని మించిపోయాడని అన్నారు నారా లోకేష్. టిడిపి నేత పయ్యావుల కేశవ్ కు గన్మెన్లను తొలగించడంపై నారా లోకేష్ మండిపడ్డారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనను తానే ప్రకటించుకున్నారని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ డేటా చోరీ, ఫోన్ టాపింగ్ గుట్టురట్టు చేశారని అక్కసుతో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ తొలగించారని మండిపడ్డారు.

ఇప్పటికే జగన్ ఆర్థిక ఉగ్రవాదాన్ని గణాంకాలతో సహా వెల్లడించిన కేశవ్ తనకు అదనపు భద్రత కావాలని కోరితే.. ఉన్న భద్రతను కూడా తొలగించారని అన్నారు. ఈ చర్యతో వైసిపి సర్కారు వేలకోట్ల మాయం, ఫోన్ ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్లు అని చెప్పారు. తక్షణమే పయ్యావుల కేశవ్ కు గన్మెన్లను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news