నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై సమీక్ష చేయనున్న ముఖ్యమంత్రి జగన్… ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జేసీయస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల పని తీరు పై నివేదికలు సిద్ధమయ్యాయి.
జగనన్న సురక్షా క్యాంపైన్ కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు క్యాంపైన్ ఉండనుంది. కాగా, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న సురక్ష సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే సర్టిఫికెట్లను ఉచితంగా ఇవ్వనున్నారు. కుల, నివాస, ఇన్ కమ్, DOB, డెత్, మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్, కొత్త రేషన్ కార్డ్, రేషన్ కార్డు నమోదు, కౌలు గుర్తింపు కార్డులు వంటివి ఫీజు లేకుండా ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజులు ఉచితంగా అందించనున్నారు.