అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈనెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరుకానున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలను లేవనెత్తాలని జగన్ భావిస్తున్నారని సమాచారం.
ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. మరి ఆయనకు అధికార పార్టీ తగిన సమయం ఇస్తుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరునంలో ఓటాన్ అకౌంట్ పెట్టాలా.. లేక ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపై చర్చ నిర్వహించారు చంద్రబాబు.