జలగ రక్తం తాగినట్లు జగన్ మద్యం రేట్లు పెంచి ప్రజల రక్తం తాగుతున్నారని, మాజీ మంత్రి కె ఎస్ జవహర్ పేర్కొన్నారు. కమీషన్ల కోసం దేశంలో ఎప్పుడూ చూడని కొత్త పేర్లతో నాసిరకం బ్రాండ్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలాగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అమ్మే బ్రాండ్లు తాగేవారికే కాదు గూగుల్ కి కూడా తెలియడం లేడన్న ఆయన ప్రెసిడెంట్ మెడల్ అనే గౌరవ పదాన్ని లిక్కర్ సీలాలకు పేర్లు పెట్టి అమ్ముతున్న ఘనత జగన్ దని అన్నారు. ప్రభుత్వానికి మద్యంపై వచ్చే కమీషన్లు చాలక మధ్యం రేట్లు పెంచి ప్రజల ప్రాణాలు తీస్తోందని, వైసీపీ ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని అన్నారు.
ధరలు తగ్గించినా ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో 50 శాతం ధరలు అధికంగా ఉన్నాయన్న ఆయన మద్యానికి అలవాటుపడిన వారు మద్యం మానలేక, పెరిగిన రేట్లతో మద్యం కొనలేక స్ర్పిరిట్, శానిటైజర్ తాగి రాష్ర్టంలో 48 మంది చనిపోయారని అన్నారు. వారి కుటుంబాలకు దిక్కెవరు? అని ప్రశ్నించారు. మద్యం రేట్లు పెంచి ప్రాణాలు బలిగొని ఇప్పుడు రేట్లు తగ్గించామని చెప్పటం సిగ్గనిపించటం లేదా? అని ఆయన అన్నారు. లాక్ డౌన్ లో గుడులు, బడులు తెరవకుండానే మద్యం దుకాణాలు తెరవటం సిగ్గుచేటని, రాష్ర్టంలో వైసీపీ నేతలే మద్యం మాపియాను పెంచి పోషిస్తున్నారని అన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యం తరలించి అధిక రేట్లకు అమ్ముతున్నారన్న ఆయన వాలంటీర్లు, వైసీపీ నాయకులే గ్రామాల్లో నాటుసారా తయారీ చేసి విక్రయిస్తున్నారు.