ఈనెల 13వ తేదిన జరగనున్న శాసనమండలి ఎన్నికలలో కూడా ఓటర్లను కోనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం అన్నారు బిజేపి నేత విష్ణువర్దన రెడ్డి. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని నిర్వహించకూడదన్నారు.
గత ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుపై విమర్శలు చేసిన వైసిపి.. ప్రస్తూతం ప్రభుత్వం పెట్టుబడులుపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పెట్టుబడులుకు సంభందించి శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే మరోసారి పొత్తులపై కూడా స్పందించారు విష్ణువర్ధన్ రెడ్డి. జనసేన – బిజేపి మధ్య పోత్తు కోనసాగుతుందని స్పష్టం చేశారు. కోన్ని పార్టిలు మాత్రం విడిపోవాలని కోరుకుంటున్నాయని… వారి కోర్కేలు తీరవన్నారు.