సికింద్రాబాద్ అల్లర్లపై జనసేన కీలక ప్రకటన..ఇది ప్రజాస్వామ్యం

సికింద్రాబాద్ అల్లర్లపై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కామెంట్స్ చేశారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్యం లో ప్రతి ఒక్కరి హక్కు అని.. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధ్వంస నిరసనలు జరపడం దురదృష్టమని పేర్కొన్నారు. అలాంటి ఘటన లను జనసేన తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు
నాదెండ్ల మనోహర్‌. పవన్ కళ్యాణ్ వచ్చి ఓ భహిరంగ సభ పెడితే జనసేన బల పడినట్లు కాదని.. క్షేత్ర స్థాయి లో ఓట్లు సంపాదించడానికి ప్రతి జనసేన కార్య కర్త కృషి చేయాలని పేర్కొన్నారు.

ఆత్మ హత్య లు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు జనసెన కార్యకర్తలు అండగా ఉండాలి…ముఖ్యమంత్రి సొంత జిల్లా లో 132 మంది పులివెందుల లో 13 మంది రైతులు నష్టాలతో ప్రాణాలు తీసుకున్నారన్నారు. ఎన్నికల ముందు పార్టీ లోకి వచ్చి సీట్లు కావాలంటే ఈ సారి కుదరదని.. కార్యకర్త గా జెండా మోసిన వారికే ఈ సారి సీట్లఅని స్పష్టం చేశారు.

సొంత ఎజెండాలతో కార్యక్రమాలు కాదు పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి..ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ పై ప్రేమ ఉంది… దాన్ని జనసేన కు బలం గా మార్చు కోవాల్సిన భాధ్యత జనసైనికులపై ఉందని తెలిపారు. క్షేత్ర స్థాయి లో పొత్తుల పై ఇప్పుడే చర్చలు వద్దు… సొంతగా బలం పుంజుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్.