జగన్ ఫ్యాన్స్ భయం: వైకాపాలో జన్మభూమి కమిటీలా?

-

గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నరోజుల్లో… జన్మభూమి కమిటీలు, సీబీఎన్ ఆర్మీ జనాలు అంటూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ని జనాలపైకి వదిలారని కామెంట్లు వచ్చాయి! పూర్తిగా ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిలా వారు ఉండాలని బాబు తలచినా కాని అది కాస్త మరోరూపం దాల్చింది! ఫలితంగా బాబు ఘోర పరాజయంలో ఇవి కూడా కీలకభూమిక పోషించాయని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇదే రకమైన ఆలోచన జగన్ చెయబోతున్నారని కథనాలు వస్తున్నాయి.

అదే నిజమైతే మాత్రం జగన్ కొంపముంచేవి అవే అని… సీఎం స్థాయిలో వ్యక్తులు ఎంత సిన్సియర్ గా ప్రయత్నించినా.. కింద జనాలలో లోపాలు ఉంటే మాత్రం కచ్చితంగా, నేరుగా ఆ ప్రభావం ప్రజలపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పే వాలంటీర్ల వ్యవస్థను జగన్ తప్పుదోవపట్టించబోతున్నారని అంటున్నారు! వాలంటీర్లు అంటే జగన్ ప్రైవేటు సైన్యం కాదనేది గట్టిగా వినిపిస్తున్న మాట! ప్రజల సొమ్మును వారికి జీతాలుగా ఇస్తున్న తరుణంలో… వారితో పార్టీ కార్యక్రమాలు చేయించడం తగదనేది కొత్తవాదన! దానికి కారణం… గత ఎన్నికల్లో జగన్ కు రాజకీయ వ్యూహాలు రచించారని చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ ఏపీకి రాబోతున్నారని వస్తోన్న కథనాలే!

దీంతో… ప్రశాంతంగా సాగిపోతున్న వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు పెరిగే అవకాశాలున్నాయని ంటున్నారు విశ్లేషకులు. పీకే టీం మెంబర్స్ గత ఎన్నికల సమయంలో నియోజకవర్గాలకు వెళ్తే… ఎమ్మెల్యేలు వారిని మహా మనుషులుగా ట్రీట్ చేస్తూ, వారి విషయంలో విపరీతమైన గౌరవం, భక్తి ప్రదర్శించేవారు! ఎమ్మెల్యే స్థాయి అభ్యర్ధులే నాడు అలా వ్యవహరిస్తే… మరి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి? వీరిపై పెత్తనం చేయించడానికన్నట్లుగా రాబోతున్నది అని చెబుతున్న పీకే టీం ని ప్రసన్నం చేసుకోవడానికే… అధికారులు, వాలంటీర్లు పనిచేసే ప్రమాధం ఉందంటున్నారు. ఈ క్రమంలో… వ్యవస్థ గాడితప్పి, జగన్ ప్రభుత్వంపై చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాధం ఉందని అంటున్నారు.

వాలంటీర్లను వాలంటీర్లుగా ఉంచి ఎన్ని పనులు చేయించుకున్నా అది జగన్ కు చాలా ప్లస్ అని… అలా కాకుండా వారు పీకే ఆధ్వర్యంలో అనధికారిక వైకాపా కార్యకర్తలుగా మారితే మాత్రం… అది మరో జన్మభూమి కమిటీలుగా మారే ప్రమాధం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ రెండో యాంగిల్ లో కూడా ఆలోచిస్తారా లేక పీకే లేకపోతే తనకు రాజకీయంగా చాలా ఇబ్బంది అని.. “వితౌట్ పీకే ఐ కాంట్” అన్నట్లుగా ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news