ఒకానొక సమయంలో ఏపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒక సంచలనం అనే చెప్పాలి! నాడు జగన్ కేసులు విషయంలో ప్రతీ రోజూ ఈ మాజీ జేడీ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేవారు! అయితే అది గతం! అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీనారాయణ… జనసేనలో చేరారు. అనంతరం జనసేనకు రాజీనామా చేశారు! ఈ క్రమంలో తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తాజా రాజకీయ పరిస్థితులు, జగన్ పరిపాలన, పవన్ రాజకీయ అవగాహనపై లక్ష్మీనారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు!
ఈ ఇంటర్వూలో జగన్ పాలనపై ఎవ్వరూ ఊహించని విధంగా స్పందించారు ఈ మాజీ జేడీ! ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని మొదలుపెట్టిన ఆయన… జగన్ మేనిపెస్టోలో ప్రకటించిన అన్ని అంశాలపైనా దృష్టి పెట్టడాన్ని తనదైన శైలిలో కామెంట్ చేశారు. కొందరు నాయకులు మేనిఫెస్టోను కేవలం ఎన్నికల్లో విజయం కోసం మాత్రమే అనుకుంటారు.. అందులో చెప్పినవి అన్నీ చేయరు.. కానీ, జగన్ మాత్రం తాను ఇచ్చిన మాటకు, మేనిఫెస్టోలో ఉన్న విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశంసించారు!
ఇదే క్రమంలో గతంలో జగన్ కేసుల ప్రస్థావన సమయాన్ని ప్రస్థావించిన లక్ష్మీనారాయణ… నాడు తన డ్యూటీ తాను నిర్వహించానే తప్ప జగన్ పై తనకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం కానీ, కక్ష కానీ లేదని చెబుతున్నారు! కేసుల విచారించిన తర్వాత కూడా తాను జగన్ కు ఎయిర్ పోర్ట్ వంటి చోట ఎదురుపడినప్పుడు… “నమస్కారం అంటే నమస్కారం” అని పలకరించుకుంటామని చెప్పారు లక్ష్మీనారాయణ! ఈ క్రమంలో… జగన్ ఏడాది పాలన పూర్తయిన తర్వాత మాత్రం తాను జగన్ పాలనకు మార్కులు ఇస్తానని తెలిపారు!
ఈ క్రమంలో జనసేన పార్టీకి రాజీనామా చేయడంపై కూడా లక్ష్మీనారాయణ స్పందించారు. తాను ఫుల్ టైం రాజకీయాలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. కాకపోతే పవన్ కళ్యాణ్ లో రాజకీయపరంగా పూర్తి పరిపక్వత కనిపించలేదని.. ఆ కారణంగానే తాను జనసేనకు రాజినామా చేశానని లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు! ఏది ఏమైనా… ఈ మాజీ జేడీ పవన్ పై ఇలాంటి కామెంట్లు చేస్తూ.. జగన్ పై అలాంటి కామెంట్లు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది!!