రాజకీయాల్లో ఉన్న లేకపోయినా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు . 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇక ఆ తర్వాత నుంచి జనసేన తో పెద్దగా అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. అసలు జెడి ఆలోచనలకు , జనసేన ఆలోచనలకు ఏమాత్రం పోసగకపోయినా, ఎవరూ ఊహించని విధంగా ఎన్నికలకు ముందు జనసేనలో జేడీ చేరి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇది ఇలా ఉంటే, జనసేన నుంచి ఆయన బయటకు వచ్చేసిన తర్వాత సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. సొంతంగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ విశాఖ నుంచే తాను రాజకీయంగా యాక్టివ్ అవ్వాలి అని చూస్తున్నారు. విశాఖ నుంచే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజల్లో మమేకమవుతూ, బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో కాకుండా, బిజెపిలోకి ఆయన వెళ్తారని అంతా, అభిప్రాయ పడగా, జనసేన వైపు మొగ్గుచూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ లోకి వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఆయన బిజెపి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. బిజెపిలో కి ఆయన వెళ్తారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నా, పూర్తిగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని, వెళ్లాలని ఉద్దేశంతో ఆగిపోయారు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్టు గా కనిపిస్తోంది. ఇప్పటికే బిజెపి అగ్రనేతలు సైతం జేడీ వస్తే సముచిత స్థానం కల్పిస్తామని, 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని, హామీ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన బీహార్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం బిజెపి అగ్రనేతలను కలిసి బిజెపి కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరుపుతూ, తన రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ బలోపేతం చేసేందుకు ప్రజాదరణ కలిగిన నాయకుడు కోసం ఎదురు చూపులు చూస్తున్న బీజేపీకి జెడి వంటి వారు వచ్చి చేరితే మరింత బలం చేకూరుతుందని, క్లీన్ ఇమేజ్ ఉన్న లక్ష్మీనారాయణ వంటి వారు రావడం ద్వారా పార్టీ కి జనాల్లో మరింత ఆదరణ పెరుగుతుందనే లెక్కల్లో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరికొద్ది రోజుల్లోనే జెడి బిజెపి కండువా క, ఆయనకు కీలకమైన నామినేటెడ్ పోస్టులు సైతం ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగే అవకాశం లేకపోలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈ వ్యవహారం పై ఏ విధంగా స్పందిస్తారో ?
-Surya