విజయవాడలో రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలకు జుడోల బొయికాట్ ప్రకటించారు. కోవిడ్ సేవలు మినహా ఎమర్జేన్సీ సేవలకు జుడోల బొయికాట్ ప్రకటించడం ప్రభుత్వానికి తల నొప్పి అయింది. తమ సమస్యలు పరిష్కారించకపోతే కోవిడ్ సేవలను కూడా నిలిపివేస్తామంటున్న జూడోలు… ఈ నెల 25 నుంచి 28వరకు పూర్తి ఎమర్జెన్సీ సేవలకు జుడోల బొయికాట్ ప్రకటించారు.
ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ వంటి తమ సమస్యలు పరిష్కారించాలంటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో సాధారణ సేవలను బహిష్కరించిన జూడోలు, రేపటి నుంచి ఎమర్జెన్సీ, క్యాజువాలిటి, లేబర్, ఐసీయూ సేవలకు జూడోలు బొయికాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు, సాధారణ వైద్య సేవలు, లేకపోవడంతో రోగుల ఇక్కట్లు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు ఎక్కువ ఇస్తున్నారు అని, ఇక్కడ ఇవ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.