ముద్ర లోన్ రాలేదా.. ఈ నెంబ‌ర్ల‌కు ఫిర్యాదు చెయ్యండి

-

మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ నే MUDRA (ముద్ర‌) అని అంటారు. ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ముద్ర రుణాల‌ను మ‌న‌కు అందిస్తుంటాయి. 2015లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. కాగా ఈ ప‌థ‌కం కింద ఎలాంటి గ్యారంటీ, ష్యూరిటీ లేకుండానే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక వ్యాపార రంగంలో స్థిర ప‌డ‌దామ‌నుకునే వారికి ముద్ర రుణాలు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ముద్ర యోజ‌న ప‌థ‌కంలో శిశు, కిషోర్‌, త‌రుణ్ పేరుతో మూడు ర‌కాల రుణాల‌ను అందిస్తున్నారు. శిశు విభాగంలో రూ.50వేల వ‌ర‌కు రుణం ఇస్తారు. అలాగే రూ.50వేల పైన రూ.5 ల‌క్ష‌ల లోపు రుణం అయితే కిషోర్ విభాగం కింద‌, రూ.5 ల‌క్ష‌ల పైన రూ.10 ల‌క్ష‌ల లోపు వ‌ర‌కు త‌రుణ్ విభాగం కింద రుణాల‌ను ఇస్తారు. ఈ రుణాల‌ను బ్యాంకులే ఇస్తాయి. అయితే శిశు విభాగం కింద ద‌ర‌ఖాస్తు చేసుకుంటే రుణం త్వ‌ర‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

వ్యాపారాన్ని విస్తరించాలనుకొనే వారికి ఈ పథకం కింద .10 లక్షల వరకు రుణం పొందవచ్చు. కింద ఐకాస్బీ 59 నిమిషాల్లో చిన్న పారిశ్రామికవేత్తలకు రూ .10,000 నుంచి రూ .10 లక్షలు ఇస్తుంది. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి గ్యారంటీ లేకుండానే ముద్ర ప‌థ‌కం కింద రుణం అందిస్తారు. దీన్ని 5 సంవ‌త్స‌రాల్లో క‌ట్టాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ బ్యాంక్ కేవ‌లం 59 నిమిషాల్లోనే ఈ రుణాన్ని ఇస్తుంది. ఈ లోన్ కోసం అప్లై చెసుకోవాల‌నుకొనేవారు https://www.mudra.org.in/ ద్వారా ధ‌ర‌ఖాస్తు చేసుకోవాచ్చు. ఇక లోన్ అప్లై చేసుకున్న త‌రువాత జాప్యం జ‌ర‌గ‌టం కానీ లేదా లోన్ రిజెక్ట్ అవ్వ‌డం కానీ జ‌రిగితే ఫిర్యాదు చేయ‌డానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించింది.

ఈ క్రింది టోల్ ఫీ నెంబ‌ర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్య‌వచ్చు

జాతీయ: 1800 180 1111 మరియు 1800 11 0001

ఆంధ్రప్రదేశ్ 18004251525
తెలంగాణ 18004258933

వ్యాపారానికి లోన్ కావాలా..? ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్..!

అండమాన్ & నికోబార్ దీవులు 18003454545
ఆంధ్ర ప్రదేశ్ 18004251525
అరుణాచల్ ప్రదేశ్ 18003453988
అస్సాం 18003453988
బీహార్ 18003456195
చండీగ 1800 ్ 18001804383
ఛత్తీస్‌గ AR ్ 18002334358
దాదా & నగర్ హవేలి 18002338944
డామన్ & డియు 18002338944
GOA 18002333202
గుజరాత్ 18002338944
హర్యానా 18001802222
హిమాచల్ ప్రదేశ్ 18001802222
జమ్ము & కష్మిర్ 18001807087
జార్ఖండ్ 1800 3456 576
కర్ణాటక 180042597777
కేరళ 180042511222
లక్షద్వీప్ 0484-2369090
మాధ్య ప్రదేశ్ 18002334035
మహారాష్ట్ర 18001022636
మణిపూర్ 18003453988
మేఘాలయ 18003453988
మిజోరం 18003453988
నాగాలాండ్ 18003453988
NCT OF DELHI 18001800124
ఒరిస్సా 18003456551
పుదుచ్చేరి 18004250016
పుంజాబ్ 18001802222
రాజస్థాన్ 18001806546
సిక్కిం 18003453988
తమిళనాడు 18004251646
తెలంగాణ 18004258933
త్రిపుర 18003453344
ఉత్తర్ ప్రదేశ్ 18001027788
ఉత్తరాఖండ్ 18001804167
వెస్ట్ బెంగాల్ 18003453344

Read more RELATED
Recommended to you

Latest news