క్యాస్టింగ్ కౌచ్.. సినీ రంగాన్ని పట్టిపీడిస్తున్న భూతం ఇది. గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ కు బలైన కొంత మంది ఇప్పుడు బయటకు రావటంతో రెండు సంవత్సరాలుగా ఈ అంశం బాగా వినిపిస్తుంది. సంచలన నటి శ్రీ రెడ్డి ఈ విషయమై పెద్ద ఉద్యమమే లేవనెత్తి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో తమకు జరిగిన అన్యాయాలపై ఒక్కొక్కరుగా నోరు విప్పడం మొదలుపెట్టారు. తాజాగా.. ఈ విషయంపై హీరోయిన్ అనుష్క స్పందించింది.
ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ.. తాను కూడా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వల్ల వేధింపుల బారిన పడ్డానని పేర్కొంది. ఇది అంతటా కామన్ అని టాలీవుడ్‌లోనూ ఇది ఉందని ఆమె పేర్కొంది. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండడంతో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని ఆమె తెలిపింది.