సమ్మర్‌లో ఏసీలు, కూలర్లు వాడటం చాలా సాధారణమైన విషయం. వీటివల్ల ఏదో ఒక ఇన్‌ఫెక్షన్లు రావడం కూడా అంతే సాధారణమైన విషయం.. అయితే ఈరోజు మీకు వీటివల్ల జరిగే నష్టాలు కాకుండా.. కొన్ని టిప్స్ చెప్పడానికి ఈ ఆర్టికల్ అందిస్తున్నాం.. జనరల్‌గా ఇంట్లో కూలర్ వేసినప్పుడు ఫ్యాన్ బన్‌జేస్తాం.. ఎందుకంటే.. సీలింగ్ ఫ్యాన్ వేడికి కూలర్ చల్లగా ఉండదు కాబట్టి..సేమ్ ఇదే రూల్ ఏసీ గదుల్లోనూ వాడుతుంటారు.. ఏసీ వేసాం కదా…మళ్లీ ఫ్యాన్ ఎందుకు అసలే కరెంట్ బిల్లు వాచిపోతుంటే అని.. కానీ మీకు తెలుసా..ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ కూడా వేయాలంట..అప్పుడు రూమ్ త్వరగా కూల్ అవుతుంది.. అన్ని మూలల చల్లగా ఉంటుంది. హైలెట్ కరెంట్ కూడా సేవ్ అవుతుంది.
సీలింగ్ ఫ్యాన్లను ఎయిర్ కండీషనర్లతో ఉపయోగించకూడదని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే.. సీలింగ్ ఫ్యాన్లు వేడి గాలిని కిందకు వచ్చేలా చేస్తాయి. ఇది కొంత వరకు నిజం. ఫ్యాన్లు సీలింగ్‌కు దగ్గరగా ఉన్నచోట, సీలింగ్ చాలా తక్కువ ఎత్తులో ఉన్న చోట ఇలా జరుగుతుంది. కానీ సీలింగ్ ఫ్యాన్‌ను ACతో ఉపయోగించినప్పుడు.. ఫ్యాన్ గదిలో గాలిని సృష్టిస్తుంది. ఇది గదిలో ఉన్న వ్యక్తులకు చల్లగా, సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది.
సీలింగ్ ఫ్యాన్ వల్ల గదిలో ఉన్న ప్రతి మూలకు కూడా చల్ల గాలి పోతుంది. సీలింగ్ ఫ్యాన్లు చల్లటి గాలిని ఒకే చోట ఉండకుండా నిరోధించి గదిలోని ప్రతి మూలకు వ్యాపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఏసీ ఎక్కువ పని చేయనవసరం లేదు. అలాగే.. గది నుంచి చల్లని గాలి బయటకు రాకుండా అన్ని కిటికీలు, తలుపులను జాగ్రత్తగా మూసివేయండి.
కరెంట్ కూడా ఆదా..
నిజానికి ఏసీ కోసం అయ్యే విద్యుత్ ఖర్చులో ఇదే కీలకమైన అంశం. ఎందుకంటే ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకుంటే దాదాపు 50 శాతం వరకు విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ఏసీలో టెంపరేచర్‌ను 24 నుంచి 26లో పెట్టి, ఫ్యాన్‌ను మినిమం స్పీడ్‌లో ఉంచండి.. అలా చేయడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. ఎందుకంటే గదిలో ఉన్న గాలిని ఏసీ క్రమంగా బరువుగా మారుస్తుంది. అదే సమయంలో ఫ్యాన్ వేయడం వల్ల గాలి రూం అంతా స్ప్రెడ్ అవుతుంది. దాంతో గది త్వరగా చల్లబడుతుంది. కరెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది.. ఉదాహరణకు ఆరు గంటల పాటు ఏసీని వినియోగిస్తే…12 యూనిట్లు ఖర్చు అయితే, ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేస్తే 6 యూనిట్లే ఖర్చవుతుంది. దీంతో ఏసీ వినియోగంతో అయ్యే విద్యుత్ ఖర్చులో 50 శాతం ఆదా అవుతుంది. ఎలా ఉంది ఐడియా..ఇక ఎందుకు లేట్.. ఈ సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్ చేయండి మరీ..!