టిడిపిని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి -కేఏ పాల్ సంచలనం

చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతాడు అని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. చంద్రబాబు మా బీఫార్మ్ దొంగిలించాడని ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ గోశిస్తుందని అన్నారు.విలీనం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు.

చంద్రబాబు కెసిఆర్ ఇతర రాజకీయ ప్రముఖులు మాకు పాద పూజ చేశారని తెలిపారు. రాష్ట్రాలు భ్రష్టు పట్టడానికి రాజకీయ నాయకులే కారణమన్నారు పాల్. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, జగన్, కేసీఆర్, కాంగ్రెస్ కుటుంబ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు. అన్ని ఓట్లు ప్రజాశాంతి పార్టీకే వేయాలంటూ ప్రజలను కోరారు. ఏపీలో ఓ మంచి మహిళను సీఎం గా చేస్తానని.. తెలంగాణలో తాను సీఎం అవుతానని అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పీఎం అవుతానని విర్రవీగాడని అన్నారు. చంద్రబాబు నాయుడు అంత మోసగాడు పుట్టలేదు, ఇకపై పుట్టడని కూడా అన్నారు.