పవన్ కల్యాణ్ డ్యాన్స్ వేస్తే ఏపీ అప్పులు తీరతాయా – కేఏ పాల్

-

పవన్ కల్యాణ్ డ్యాన్స్ వేస్తే రాష్ట్రంలో అప్పులు తీరతాయా.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశాం..రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షల మంది ఆన్లైన్ లో పార్టీలో చేరుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని.. చారిటీ డబ్బు ఒక్క రూపాయి కూడా పార్టీకి వాడటం లేదని ఫైర్‌ అయ్యారు.

ప్రతి గ్రామానికి సర్పంచ్ ద్వారా కోటి రూపాయలు ఇస్తానని.. ఐదు సంవత్సరాలలొ రాజధాని ఎందుకు కట్టలేదు చంద్రబాబు..అని మండిపడ్డారు. బీజేపీ ప్రజాదర్బార్ పెడతారట, ఛార్జ్ షీట్ లు వేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు…3.5లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ఆగ్రహించారు.

నేను క్వాలిఫై కాదని అంటున్నారు..నన్ను ఎందుకు డిస్ క్వాలిఫై చేసారు..స్టీల్ ప్లాంట్ కోసం నేను కోర్టు లో పిల్ వేశానన్నారు. నాతో ఎవరైనా డిబేట్ కు వస్తారా..నేను రెడీ..చంద్రబాబు 5 లక్షల కోట్లు,జగన్ నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసారని ఆగ్రహించారు. గతంలో నేను అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫండ్స్ ఇచ్చాను..హైకోర్టు న్యాయమూర్తి ని వేడుకుంటున్నాను..నాకు టైం కేటాయించమని..స్టీల్ ప్లాంట్ లో 44 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు కేఏ పాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news