కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి మంజూరు అయింది. కడప స్టీల్‌ప్లాంట్ విషయంలో కీలక ముందడుగు పడినట్టే. అత్యంత వేగంగా పర్యావరణ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. – కేంద్ర పర్యావరణ, అటవీ, క్లైమేట్ ఛేంజ్ మంత్రిత్వశాఖనుంచి అనుమతి వచ్చింది. ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ వచ్చింది.
కడప స్టీల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరుచేయాలంటూ డిసెంబర్ 20, 2020న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. తిరిగి జనవరి 29, 2021న మరోసారి సవరణలతో ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనలకు ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కాపీని రాష్ట్ర ప్రభుత్వం జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై డిసెంబర్ 30, 31, 2020 మరియు ఫిబ్రవరి 10,11 2021 తేదీల్లో ‘‘ఈఏసీ’’ సమావేశాలు నిర్వహించారు.
గ్రామ సభల్లో ప్రభుత్వ ప్రతిపాదనలు, కార్యచరణ ప్రణాళికలపై చేసిన చర్చల్లో సంతృప్తి వ్యక్తమైందని ఈఏసీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సమగ్రంగా పరిశీలన చేసి వాటికి అనుమతులు ఇస్తున్నట్టుగా పేర్కొంది. ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్( ఈఐఏ) నోటిఫికేషన్, 2006 ప్రకారం పర్యావరణ అనుమతి మంజూరు చేస్తున్నట్టుగా తెలిపింది. వైయస్సార్ జిల్లా కడప జిల్లా సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరు గ్రామాల్లో స్టీల్‌ప్లాంట్‌ను ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. తొలిదశలో ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితోపాటు 84.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ప్రాజెక్టు ఏరియాలో భాగంగా 33 శాతం అంటే 484.4 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేస్తారు.