అంబేద్కర్ మహాశిల్పం పై దాడి జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ప్రభుత్వానికి తెలియకుండా ఈ దాడి జరిగే అవకాశం ఉందా అని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఈ దాడి పై రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి దుండగులు దాడి చేశారన్నారు. ఇంకోసారి ఏపీ ఐఐసి వాళ్ళు వచ్చారు అన్నారు. మరోసారి ఎవరో జగన్ గారు అంటే గిట్టని దళితులు అంటున్నారు.
అసలు దాడి చేసింది ఎవరైనా తేల్చాల్సింది ప్రభుత్వ మే కదా.. అంత మంది వచ్చి దాడి చేస్తుంటే తెలియలేదా..? లైట్లు ఆర్పేస్తే…ఎందుకు సిబ్బందిని విచారించలేదు. అంబేడ్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ పైనా, ఆయన భావ జాలం పైనా చంద్రబాబు ఈరోజు గౌరవం లేదు. అందుకే ఈ దాడి జరిగినా కనీసం స్పందించలేదు. స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం సీఎం చంద్రబాబు కి ఇష్టం లేదు. అంబేద్కర్ స్మృతివనం ని తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టే కుట్ర ఉంది. అందులో భాగంగానే ఈ దాడి కి పాల్పడ్డారని భావిస్తున్నాం అని అనిల్ కుమార్ పేర్కొన్నారు.