పవన్ కళ్యాణ్ కాల్షీట్ ముగిసింది… అందుకే హైదరాబాద్ వెళ్ళి పోయారని చురకలు అంటించారుపౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది…విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. మంత్రి రోజా వెంట్రుక వాసిలో దాడి నుంచి తప్పించుకున్నారు….పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారు?? అని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు అన్ని జనవాణీలను పవన్ కళ్యాన్ యువతకు పవన్ కళ్యాణ్ మంచి మాటలు చెప్పాల్సింది పోయి…దాడి చేయమని రెచ్చగొడతారా?? అని నిలదీశారు పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు. ఎంత మందికి తాట తీశారు ఇప్పటి వరకు మేం ప్రజలతో ఎన్నిక అయినవాళ్ళం…మమ్మల్ని కొడితే రాష్ట్ర ప్రజలను కొట్టినట్లేనని పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ప్రజల పైనే దాడి చేసే స్థాయికి వెళ్ళారు..ఇప్పటి వరకు ఉన్న ముసుగు తొలిగిందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు. ప్యాకేజీ, దత్త పుత్రుడు అన్న మాటలను నిజమే అని స్పష్టం చేశారన్ననారు.