కొడాలి నాని క్లారిటీ కరెక్టే అంట బాబు!

-

గతకొన్ని రోజులుగా టీడీపీ నేతలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లకు దొరికిన ఒక లాజిక్…. స్కూల్స్ తెరిచినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు? అని! వాటికి వీటికీ ఏమిటి సంబంధం.. అసలు లజిక్ లేని ఈ వాదన ఏమిటి.. వంటి అంశాలపై తనదైన శైలి క్లారిటీ ఇచ్చారు ఏపీ మంత్రి కొడాలి నాని!

ఏపీలో స్కూల్స్ తెరిచారు.. అలాంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు అడ్డుచెబుతుంది అనేది తమ్ముళ్ల ప్రశ్న! అయితే… స్కూల్ పిల్లల్ని కూడా తన రాజకీయాల్లో పావులుగా వాడుకోవాలని చూస్తూ చంద్రబాబు మరీ దిగజారి పోయారని మొదలుపెట్టిన నాని… అసలు స్కూల్స్ ఎందుకు పెట్టారు.. ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు.. స్కూల్స్ లో ఎన్ని జాగ్రత్తలు తిసుకుంటున్నారు వంటి విషయాలపై క్లారిటీ ఇచ్చారు!

“ఇప్పటికే విద్యార్థులు చాలా రోజులు నష్టపోయారు.. ఇంకా స్కూల్స్ తెరవకపోతే విద్యా సంవత్సరం మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది.. అందుకే స్కూళ్లు తెరిచాము! ఇప్పటిప్పుడు స్థానిక ఎన్నికలు జరక్కపోతే వచ్చే నష్టమేంఈ లేదు.. కానీ క్లాసులు జరగకపోతే మాత్రం విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం వెనకపడిపోతారు.. స్థానిక ఎన్నికల్లో ఓటర్లు కనీసం నాలుగైదు బ్యాలెట్లను పట్టుకోవాల్సి వస్తుండటం వల్ల కరోనా వ్యాపించడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంది” అని కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు!!

Read more RELATED
Recommended to you

Latest news