ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో వైయస్సార్ శాసనసభాపక్షనేత, ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైయస్సాసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు అయ్యారు. మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలు ఎమ్మెల్యే తిరగాలని.. ఒక్కో గ్రామ సచివాలయానికి 2 రోజులు వెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో ప్రతి ఇంటికీ తిరగాలి.. ఆ ఇంట్లో జరిగిన మేలేంటి? ప్రతి కుటుంబానికి జరిగిన మేలుపై ముఖ్యమంత్రిగారి రాసిన లేఖను అందించాలని పేర్కొన్నారు. వారి ఆశీస్సులను పొందాలని.. ఈ గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు క్యాడర్‌ను ప్రజలకు దగ్గర చేయాలని ఆదేశించారు. క్యాడర్‌తో మీరు మమేకం చేయాలని.. మళీ బేసిక్స్‌లోకి వెళ్లి బూత్ కమిటీల ఏర్పాటు కూడా జరగాలన్నారు.
బూత్‌కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలని.. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగాలని.. వేరే సచివాలయానికి వెళ్లేముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో డోర్–టు డోర్ పూర్తికావడానికి కనీసం 8 నెలలు పడుతుందని.. 8 నెలలు అయ్యేసరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్తారని స్పష్టం చేశారు. తన ఆదేశాలు పాటించిన వారికే టికెట్ ఇస్తానని స్పష్టం చేశారు సీఎం జగన్.