మాస్క్ లు ఇవ్వకుంటే విధులు చెయ్యలేమని చెప్పిన లైన్ మెన్ ను సస్పెన్షన్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేస్కుంది. కోవిడ్ సమయంలో ఇంటింటికీ వెళ్ళి విద్యుత్ బిల్లులు వసూలు ప్రక్రియలో తనకు రక్షణ కవచాలైన మాస్క్,శానిటైజర్లు ఇవ్వాలని ఉన్నతాదికారులను కోరిన లైన్ మెన్ అనిల్ కుమార్ కు అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత కారణాలతో కక్ష గట్టి ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కక్ష సాధింపు తో విధ్యుత్ శాఖ డిఈ. అశోక్ కుమార్ తనను సస్పెండ్ చేసారని ఆరోపిస్తూన్నారు లైన్ మెన్ అనిల్. సస్పెన్షన్ ఎత్తివేసి, ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నూజివీడు విధ్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన దీక్ష చేపట్టాడు విస్సన్నపేట విద్యుత్ లైన్ మెన్ అనిల్. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.