HYD: లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్ పై బదిలీ వేటు

-

మాజీ సీఎం జగన్‌ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్‌ ఇచ్చారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందని… బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందని… ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్.. తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడని ఫైర్‌ అయ్యారు.

YCP chief Jagan’s meeting with party MLCs ended

అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు….శవాలతో రాజకీయాలు చేసే విష సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? అని నిలదీశారు. నేరాలు చేసి.. మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే జగన్ కపట నాటకాలకు కాలం చెల్లిందని… ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు….ఏ నిందితుడినీ వదిలేది లేదన్నారు.
బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదని చురకలు అంటించారు. జగన్ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం కాదు.. ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news